Ola prime plus: హైదరాబాద్‌లో ఓలా ప్రైమ్‌ ప్లస్ సేవలు

Ola prime plus now in Hyderabad: ఓలా ప్రైమ్‌ ప్లస్‌ సేవలు హైదరాబాద్‌ సహా మూడు నగరాల్లో ప్రారంభమయ్యాయి. తొలుత బెంగళూరులో ఈ సేవలను అందుబాటులోకి వచ్చాయి.

Updated : 04 Aug 2023 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్యాబ్ బుకింగ్‌ సేవల సంస్థ ఓలా (Ola) తన ప్రైమ్‌ ప్లస్‌ సేవలను (Ola prime plus) మరిన్ని నగరాలకు విస్తరించింది. బెంగళూరులో ప్రారంభించిన ఈ సేవలకు అనూహ్య స్పందన రావడంతో మరో మూడు నగరాలకు విస్తరించింది. ఇందులో హైదరాబాద్‌తో (Hyderabad) పాటు ముంబయి, పుణె నగరాలు ఉన్నాయి. తొలుత ఎంపిక చేసిన కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చామని, తర్వాత అందరికీ ఈ సేవలను తీసుకొస్తామని ఓలా క్యాబ్స్‌ సీఈఓ భవీశ్ అగర్వాల్‌ పేర్కొన్నారు.

అధునాతన ఫీచర్లతో టాటా పంచ్‌ సీఎన్‌జీ!

ఓలా అందించే ప్రీమియం సర్వీసులను ఓలా ప్రైమ్‌ ప్లస్‌గా పేర్కొంటోంది. తొలుత మే 28న బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించారు. ప్రైమ్‌ ప్లస్‌ సర్వీసుల్లో ప్రొఫెషనల్‌ డ్రైవర్లు అందుబాటులో ఉంటారు. టాప్‌ కార్స్‌తో పాటు సర్వీసుల క్యాన్సిలేషన్లు, ఆపరేషన్‌ ఇబ్బందులు వంటివి ఉండబోవని కంపెనీ చెబుతోంది. మెరుగైన సౌకర్యాలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ సేవలను ప్రారంభించినట్లు ఓలా తెలిపింది. క్యాబ్‌ను బుక్‌ చేసుకునేటప్పుడు ప్రైమ్‌ ప్లస్‌ సేవలు ఎంచుకుంటే ఈ సౌకర్యాలను పొందొచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను భవీశ్‌ గతంలో ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు