Reliance: రిలయన్స్‌ నికర లాభం రూ.17,265 కోట్లు

Reliance Q3 Results: డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. 

Published : 19 Jan 2024 22:09 IST

Reliance Q3 Results | ఇంటర్నెట్‌ డెస్క్‌: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో (Q3 Results) రూ.17,265 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభం( రూ.15,792 కోట్ల) తో పోలిస్తే 9.3 శాతం వృద్ధి చెందింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.2.2 లక్షల కోట్లకు చేరిందని రిలయన్స్‌ వెల్లడించింది.

రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) మూడో త్రైమాసికంలో రూ.3,165 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,400 కోట్ల లాభం వచ్చింది. దీంతో 31.87 శాతం లాభం పెరిగినట్లు సంస్థ తెలిపింది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.67,623 కోట్ల నుంచి 23.75 శాతం పెరిగి రూ.74,373 కోట్లకు చేరింది.

టెలికాం విభాగం జియో డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.5,445 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది అక్టోబర్‌ - డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే  ఇది 11.6 శాతం అధికం. మొత్తం ఆదాయం 11.4 శాతం వృద్ధి చెంది రూ.32,510 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఒక్కో వినియోగదారుపై వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ.181.7కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు