Reliance Retail: రిలయన్స్ చేతికి మెట్రో ఇండియా.. రూ.2,850 కోట్లతో కొనుగోలు
మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా (Metro Cash & Carry India) కొనుగోలుతో రిలయన్స్ (Reliance) తమ రిటైల్ వ్యాపారాన్నిమరింత విస్తరించనుంది.
దిల్లీ: దేశీయ రిటైల్ రంగ వ్యాపారంలో మరింత బలోపేతం అయ్యే దిశగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance) మరో ముందడుగు వేసింది. జర్మనీ సంస్థ మెట్రో ఏజీ భారత్‌లో ‘మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా (Metro Cash & Carry India)’ నిర్వహిస్తున్న టోకు వ్యాపారాన్ని ఆర్ఐఎల్ చేజిక్కించుకుంది. ఈ కొనుగోలు విలువ రూ.2,850 కోట్లు. పూర్తిగా నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య నిశ్చయాత్మక ఒప్పందం కుదిరింది.
మెట్రో ఇండియా 2003లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 హోల్‌సేల్ పంపిణీ కేంద్రాలున్నాయి. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న రిటైలర్లు వంటి బిజినెస్ కస్టమర్లతో ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తోంది. ‘క్యాష్-అండ్-క్యారీ’ వ్యాపార నమూనాతో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. దాదాపు 3 మిలియన్ల కస్టమర్లకు సేవలందించింది. దీంట్లో 1 మిలియన్ కస్టమర్లు తరచూ మెట్రోతో కొనుగోళ్లు చేస్తున్నారు. 2022 సెప్టెంబరుతో ముగిసిన ఏడాది వ్యవధిలో ఈ కంపెనీ రూ.7,700 కోట్లు విలువ చేసే విక్రయాలు జరిపింది. భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత మెట్రోకు ఇదే మెరుగైన రికార్డు.
చిరు వ్యాపారులు, సంస్థల సహకారంతో వినియోగదారులకు చేరువవ్వాలనే తమ వ్యాపార నమూనాలో భాగంగానే మెట్రో ఇండియాను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇశా అంబానీ తెలిపారు. భారత B2B మార్కెట్లో మెట్రో పటిష్ఠమైన బహుళ-ఛానెల్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించిందన్నారు. భారత కిరాణా మార్కెట్‌పై రిలయన్స్‌కున్న లోతైన అవగాహనకు మెట్రో నెట్వర్క్ జత కలిస్తే దేశంలో చిరు వ్యాపారులకు ప్రత్యేకమైన లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా సెమీ కండక్టర్ చిప్‌ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్‌కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్‌ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్‌కు మారడమే ఇందుకు కారణం. -
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్ వారెన్ బఫెట్ ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్