Retail inflation: స్వల్పంగా తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

Feb Retail inflation: రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి నెలకు గానూ 6.44 శాతంగా నమోదైంది.

Published : 13 Mar 2023 19:46 IST

దిల్లీ: వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail inflation) కాస్త తగ్గుముఖం పట్టింది. జనవరిలో 6.52 శాతంగా నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 6.44 శాతంగా నమోదైంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 6.07 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం సంబంధిత గణాంకాలను వెల్లడించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 6.72 శాతంగా ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 6.10 శాతంగా నమోదైంది. జనవరిలో 6 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.95 శాతానికి తగ్గింది. 

ఫిబ్రవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గినా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన స్థాయి కంటే పైనే ఉండడం గమనార్హం. గతేడాది నవంబర్‌, డిసెంబర్‌ మినహా 2022 జనవరి నుంచి ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్షిత స్థాయికి ఎగువనే రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదవుతూ వస్తోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం కిందకు ఉంచేందుకు రెపో రేటును దశలవారీగా ఆర్‌బీఐ పెంచుతూ వస్తోంది. తాజాగా ఫిబ్రవరిలో 25 బేసిన్‌ పాయింట్లు పెంచింది. మరోసారి పెరుగుదల ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని