Adani- Hindenburg: అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సెబీ స్టేటస్‌ రిపోర్ట్‌

Adani- Hindenburg: అదానీ- హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై తన దర్యాప్తునకు సంబంధించి సెబీ తన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించింది. ఈ కేసు ఆగస్టు 29న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

Published : 25 Aug 2023 20:19 IST

దిల్లీ: అదానీ- హిండెన్‌బర్గ్‌ (Adani- Hindenburg) వ్యవహారంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తన దర్యాప్తు స్థితికి సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్‌ కంపెనీలకు సంబంధించి మొత్తం 24 లావాదేవీలకు గానూ 22 లావాదేవీలపై తమ దర్యాప్తు పూర్తయ్యిందని సెబీ అందులో పేర్కొంది. మరో రెండు లావాదేవీలకు సంబంధించి ఇతర ఏజెన్సీల నుంచి సమాచారం రావాల్సి ఉందని పేర్కొంది.

Zepto: జెప్టో జాక్‌పాట్‌.. ₹1,653 కోట్ల నిధుల సమీకరణ

అదానీ గ్రూప్‌లో అవతవకలు జరిగాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్‌ కంపెనీలు భారీగా తమ మార్కెట్‌ విలువను కోల్పోయాయి. దీంతో పాటు అదానీ గ్రూప్‌పై రాజకీయంగానూ దుమారం రేగింది. ఈ అంశంపై దర్యాప్తు జరపాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెబీ స్టేటస్‌ నివేదికను సమర్పించింది. అయితే, దర్యాప్తు వివరాలను మాత్రం అందులో వెల్లడించలేదు. దీనిపై ఆగస్టు 29న సుప్రీంకోర్టు విచారణకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని