Maruti Suzuki: ₹1.25 లక్షల కోట్ల క్యాపెక్స్‌.. 10 కొత్త మోడళ్లు.. 2031 నాటికి మారుతీ సుజుకీ ప్లాన్స్‌!

Maruti Suzuki: వచ్చే కొన్నేళ్ల పాటు తమకు భారీ ఎత్తున మూలధనం అవసరమని కంపెనీ తెలిపింది. కొత్త మోడళ్ల అభివృద్ధి, తయారీ సామర్థ్యం పెంపునకు నిధులు కావాల్సి ఉందని తెలిపింది.

Published : 09 Oct 2023 17:13 IST

దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) మూలధన వ్యయం 2030-31 నాటికి దాదాపు రూ.1.25 లక్షల కోట్ల దాకా ఉంటుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 17 మోడళ్లను 28 వరకు విస్తరిస్తామని వెల్లడించింది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుతామని తెలిపింది.

మరో 20 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం రూ.45 వేల కోట్లు అవసరమని మారుతీ సుజుకీ (Maruti Suzuki India) తెలిపింది. ప్రస్తుత ధరలకు స్వల్పంగా ద్రవ్యోల్బణాన్ని కలిపి ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంది. విక్రయాలు, సేవలు, విడిభాగాల మౌలికవసతుల ఏర్పాటుకు నిధులు అవసరమని తెలిపింది. అలాగే ‘ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌ (ICE)’ కార్లపై కొనసాగుతున్న పరిశోధనలకూ మూలధనం కావాల్సి ఉందని పేర్కొంది. వివిధ ఇంధన ఆప్షన్లతో 10-11 కొత్త మోడళ్లనూ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంది. వీటితో పాటు విద్యుత్‌ వాహనాలు, ఎస్‌యూవీల తయారీకీ పెద్ద ఎత్తున మూలధన వ్యయం అవసరమని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని