Uber: క్యాబ్ ఆలస్యం.. ఉబర్‌కు ₹20 వేల జరిమానా
Uber: సేవలు ఆలస్య అందించినందుకుగానూ ఉబర్‌కు ముంబయి కన్జ్యూమర్ కోర్టు రూ.20,000 జరిమానా విధించింది.
ముంబయి: ముంబయికి చెందిన ఓ వినియోగదారుల ఫోరం ఉబర్ ఇండియాపై రూ.20 వేల జరిమానా విధించింది. క్యాబ్ బుక్ చేసుకున్న వ్యక్తికి ఆలస్యంగా సేవలు అందించిన కారణంగా ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2018లో జరిగిన ఈ ఘటన జరగ్గా.. వినియోగదారుడికి అనుకూలంగా తాజాగా తీర్పు వెలువడింది.
ముంబయికి చెందిన కవితా శర్మ అనే న్యాయవాది 2018 జూన్ 12న చెన్నైకి వెళ్లాల్సిన విమానం ఎక్కాల్సి ఉంది. విమానాశ్రయానికి 36 కి.మీ దూరంలో ఆమె ఇల్లుంది. అక్కడి నుంచి ఆమె మధ్యాహ్నం 3:29 గంటలకు క్యాబ్ బుక్ చేశారు. కానీ, యాప్‌లో చూపించిన దాని కంటే క్యాబ్ 14 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. అదీ మధ్యలో పలుసార్లు డ్రైవర్‌కు కాల్ చేయాల్సి వచ్చిందని కోర్టుకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా ఫోన్లో మాట్లాడుతూ.. ప్రయాణాన్ని మరింత ఆలస్యంగా ప్రారంభించాడని తెలిపారు. ఆపై వేరే మార్గంలో వెళ్లి కొంత సమయం.. సీఎన్జీ స్టేషన్లో ఆపి మరింత జాప్యం చేశాడని చెప్పారు. దీంతో 15-20 నిమిషాలు ఆలస్యమైందని తెలిపారు. అప్పటికే విమానం వెళ్లిపోయిందన్నారు. దీంతో మరో టికెట్ కొనుక్కొని తర్వాతి విమానానికి వెళ్లాల్సి వచ్చిందన్నారు.
పైగా యాప్‌లో బుక్ చేసుకున్న సమయంలో ట్రిప్ ఖరీదు రూ.563 చూపించగా.. చివరకు ఉబర్ రూ.703 బిల్లు చేసినట్లు కవిత తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేయగా.. తర్వాత రూ.139 తిరిగి ఖాతాలోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. కవిత తొలుత ఉబర్ కంపెనీకి న్యాయపరమైన నోటీసులు పంపారు. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఆమె ఠాణె జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. అప్పుడు స్పందించిన ఉబర్ తాము కేవలం వినియోగదారులు, డ్రైవర్ల మధ్య అనుసంధానం చేసే వేదిక మాత్రమేనని వివరణ ఇచ్చింది. అయితే, యాప్‌ను కంపెనీయే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ వేదికగా జరిగే లావాదేవీలు, సేవలకు బాధ్యత వహించాల్సిందేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. కోర్టు ఖర్చుల కింద రూ.10,000, మానసికంగా వేదనకు గురి చేసినందుకుగానూ మరో రూ.10,000 చెల్లించాల్సిందేనని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్‌గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్‌గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్‌కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్‌ను పరిచయం చేయడం కోసం ఐహెచ్‌జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు