Wipro Q2 Results: విప్రో లాభం రూ.2,667 కోట్లు

Wipro Q2 Results: బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాల్ని బుధవారం ప్రకటించింది.

Published : 18 Oct 2023 20:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  ఐటీ సేవల దిగ్గజం విప్రో (Wipro) రెండో త్రైమాసిక (Q2 Results) ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.2,667.3 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,649.1 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నట్లు కంపెనీ తన రెగ్యుటేరీ ఫైలింగ్‌లో తెలిపింది.

బ్యాంకాక్‌, సింగపూర్‌ రూట్లలో ఎయిరిండియా ప్రత్యేక ఆఫర్లు.. అక్టోబర్‌ 21 వరకే!

ఇక ఆదాయం విషయానికొస్తే.. గతేడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.22,539.7 కోట్లుగా కంపెనీ ఆదాయం ఉండేది. ఈ ఏడాది అదే సమయానికి రూ.22,515.9  కోట్లకు తగ్గిందని విప్రో తెలిపింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్‌ ఇన్సూరెన్స్ (BFSI) రంగాల్లో బలహీనతలే ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది. అలాగే, రానున్న త్రైమాసికానికి తన వృద్ధి అంచనాలను తగ్గించింది.  ఆదాయంలో 3.5 శాతం నుంచి 1.5 శాతం మేర క్షీణత నమోదు కానున్నట్లు అంచనా వెలువరించింది. ఫలితాల నేపథ్యంలో మార్కెట్‌ ముగిసే సమయానికి విప్రో షేరు విలువ 0.95 శాతం తగ్గి రూ.407.50 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని