logo

విజయవాడ రైల్వేస్టేషన్‌లో రూ.20కే నాణ్యమైన భోజనం

వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్‌సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్‌ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు.

Updated : 24 Apr 2024 09:06 IST

విజయవాడ(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్‌సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్‌ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారి కోసం బోగీల వద్దే నేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రెండు రకాల భోజనాలను అందిస్తున్నారు. ఈ ప్రత్యేక కౌంటర్లు విజయవాడతో పాటు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వేసవి పూర్తయ్యే వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఎకానమీ మీల్స్‌ ప్యాకెట్‌ రూ.20, స్నాక్స్‌ మీల్స్‌ రూ.50కే అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు