logo

అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!

ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్‌లు ఇస్తుంటారు.

Published : 24 Apr 2024 05:21 IST

ఈనాడు, కృష్ణా: ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్‌లు ఇస్తుంటారు. కంకిపాడు నుంచి కుందేరు, కాటూరు, మానికొండ, పెదపారుపూడి, గన్నవరం, గుడివాడ ఇలా పలు గ్రామాలను కలుపుతూ బస్సు సౌకర్యం ఉండేది. పక్కనే ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో 9 ఏళ్లుగా బస్సు సౌకర్యం నిలిపివేశారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన తెదేపా ప్రభుత్వం 2015లో రూ.6.5కోట్లతో కంకిపాడు మండలం పునాదిపాడు-పెదపారుపూడి రహదారిలో రైవస్‌ కాలువపై కుందేరు గ్రామంలో వంతెన నిర్మాణం చేపట్టింది.

70 శాతం వంతెన నిర్మాణం పూర్తయింది. ఈలోగా ప్రభుత్వం మారింది. వైకాపా అధికారంలోకి వచ్చాక దానివైపే చూడలేదు. కొత్త వంతెన పూర్తి కాకపోవడంతో ఈ ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తెదేపా హయాంలో వంతెన నిర్మాణం చేపట్టడమే తప్పా.. కూల్చడమే కానీ నిర్మించడం తెలియని ప్రభుత్వం ఇది అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చే నాయకులను ఈ సారి వంతెన నిర్మాణంపై నిలదీస్తామని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇది పూర్తయితే సుమారు 13 గ్రామాల ప్రజలు సులువుగా రాకపోకలు సాగించే వీలయ్యేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని