logo

‘చంద్రబాబు కృషితో రూ.14 లక్షల ప్యాకేజీ ఉద్యోగం’

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషితో లక్షలాది మంది విద్యార్థులకు నేడు ఐటీ ఉద్యోగాలు లభించాయని స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణపొంది ఐటీ ఉద్యోగం చేస్తున్న పోలూరు మాధవ నాయుడు పేర్కొన్నాడు. 

Updated : 21 Sep 2023 08:10 IST

సర్టిఫికెట్‌ చూపుతున్న పోలూరు మాధవ

రామగిరి, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషితో లక్షలాది మంది విద్యార్థులకు నేడు ఐటీ ఉద్యోగాలు లభించాయని స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణపొంది ఐటీ ఉద్యోగం చేస్తున్న పోలూరు మాధవ నాయుడు పేర్కొన్నాడు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన రైతు రంగనాయకులు కుమారుడైన ఈ యువకుడు అనంతపురం నగరంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో 2015-2018లో బీటెక్‌ చదువుతున్న సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా అక్కడే శిక్షణ పొందినట్లు తెలిపాడు. బీటెక్‌ పూర్తియిన తరువాత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సర్టిఫికెట్‌తో ఉద్యోగంలో చేరినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో తనకు ఏడాదికి రూ.14 లక్షల వేతనం వస్తోందని చెప్పాడు. ఐటీ అభివృద్ధితో పాటు, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించడంతో సులభంగా ఉద్యోగాలు లభించడంతో తనలాగే ఎంతోమంది విద్యార్థులు లబ్ధి పొందారన్నాడు. ఇలాంటి కార్యక్రమంలో చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడ్డారంటూ అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నాడు. చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులతోపాటు పెద్దఎత్తున ప్రజలు అండగా నిలుస్తున్నారని తెలిపాడు. తామంతా చంద్రబాబుతోనే ఉంటామని వివరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని