logo

రాష్ట్ర ప్రయోజనాలకే కూటమి: సునీత

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ నేతలతో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు

Published : 17 Apr 2024 05:41 IST

తెదేపాలో చేరిన ఆత్మకూరు తండా వార్డు సభ్యులు లక్ష్మీదేవి, వెంకటేశ్‌ నాయక్‌లతో పరిటాల సునీత, మురళి, తదితరులు
అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు : వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ నేతలతో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిశారని, కేంద్రం సహకారం ఉండాలనే ఉద్దేశంతో భాజపా పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. భాజపా, జనసేన నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి, రాప్తాడులో తెదేపా జెండా ఎగురవేయాలని ఆమె కోరారు. రాప్తాడు, ఆత్మకూరు మండలం, అనంతపురం గ్రామీణం, చెన్నేకొత్తపల్లి, మండలాలకు చెందిన పలువురు కీలక నాయకులు తెదేపాలో  చేరారు. పార్టీలో  చేరిన వారిలో మాజీ జడ్పీటీసీ రామాంజనేయులు కుమారుడు కేశవ, ఓబుళపతి, లక్ష్మీపతి, నారాయణ, కుళ్లాయప్ప, దుర్గప్ప, నగేశ్‌, కొండయ్య, చెన్నకేశవులు ఉన్నారు. అంతకుముందు రామగిరిలో పరిటాల సునీత స్వగృహంలో కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల నాయకులతో ఆమె సమావేశమయ్యారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని