logo

సొంత నిధులు వెచ్చించినా అందని బిల్లులు

సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న సామెతకు నిలువెత్తు నిదర్శనం పంచాయతీలు. కేంద్రం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఎంచక్కా వాడేసుకుని పబ్బం గడిపింది.

Published : 17 Apr 2024 05:54 IST

ఆలమూరులో సొంత నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు

తపోవనం (అనంత గ్రామీణం): సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న సామెతకు నిలువెత్తు నిదర్శనం పంచాయతీలు. కేంద్రం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఎంచక్కా వాడేసుకుని పబ్బం గడిపింది. రెండేళ్ల నుంచి స్టాంపుడ్యూటీ సర్‌ఛార్జి విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనులన్నీ అటకెక్కాయి. ఆలమూరు గ్రామంలో సర్పంచి జి.సౌమ్య రూ.16 లక్షలు వెచ్చించి సిమెంటు రహదారులు, మురుగు కాలువలు నిర్మించారు. పంచాయతీకి ఒకసారి నిధులు రావడంతో రూ.5 లక్షల బిల్లు వచ్చింది. మరో రూ.12 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. అనంతపురం గ్రామీణ మండలంలోని 25 గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అప్పులకు వడ్డీలు చెల్లించలేక సర్పంచులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని