logo

1.22 లక్షల రైతు కుటుంబాలకు రూ.91.87 కోట్లు

రైతు భరోసా, పీఎం కిసాన్‌ మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 1,22,500 మంది రైతు కుటుంబాలకు రూ.91,87,50,000ను ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

Updated : 02 Jun 2023 05:32 IST

 

మొదటి విడత నిధుల చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: రైతు భరోసా, పీఎం కిసాన్‌ మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 1,22,500 మంది రైతు కుటుంబాలకు రూ.91,87,50,000ను ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో రైతులకు చెక్కును అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన 3,088 మంది రైతులకు పెట్టుబడి రాయితీ, పంట కోత అనంతరం నష్టపోయిన 474 మంది రైతులకు రూ.3,28,19,309 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. పంటనష్టం జరిగిన సీజన్‌లోనే నష్టపరిహారాన్ని రైతులకు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కుమ్మరి శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మండెపూడి పురుషోత్తం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి సుజాత, ఎన్‌ఆర్‌ఈడీసీ డైరెక్టర్‌ కొత్త చిన్నపరెడ్డి, డిప్యూటీ మేయర్‌ సజీల, రైతులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని