logo

‘గాంధీ’ ప్రిన్సిపల్‌గా డీఎంఈ రమేష్‌రెడ్డి

గాంధీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా, అదనపు డీఎంఈగా డీఎంఈ రమేష్‌రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ ఎం.రాజారావుకు పూర్తిస్థాయి బాధ్యతలు కల్పిస్తూ డీఎంఈ రమేష్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు బుధవారం ఇరువురూ బాధ్యతలు స్వీకరించారు.

Published : 09 Dec 2021 02:41 IST

రమేష్‌రెడ్డిని అభినందిస్తున్న తెలంగాణ వైద్యుల సంఘం ప్రతినిధులు

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా, అదనపు డీఎంఈగా డీఎంఈ రమేష్‌రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ ఎం.రాజారావుకు పూర్తిస్థాయి బాధ్యతలు కల్పిస్తూ డీఎంఈ రమేష్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు బుధవారం ఇరువురూ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు గాంధీ కళాశాల ప్రిన్సిపల్‌గా, న్యూరోసర్జరీ హెచ్‌వోడీగా విధులు నిర్వహించిన ప్రొఫెసర్‌ జి.ప్రకాశ్‌రావు సంగారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పదోన్నతిపై వెళ్లారు.ఆసుపత్రి, కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు హెచ్‌వోడీలు, ప్రొఫెసర్లను పదోన్నతిపై వివిధ ఆసుపత్రులకు డీఎంఈ రమేష్‌రెడ్డి బదిలీ చేశారు. పిడియాట్రిక్‌ విభాగం ప్రొ.శివరాంప్రసాద్‌ను జగిత్యాల మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా, ఆర్థోపెడిక్‌ ప్రొ.వాల్యాను నిజామాబాద్‌ ఆసుపత్రి సూపరింటెండెంటెంట్‌గా, కార్డియాలజీ ప్రొ.నితిన్‌కుమార్‌ కాబ్రాను ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపరింటెండెంట్‌గా, కె.ఇందిరను నిజామాబాద్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా, మైక్రోబయాలజీ ప్రొ.నాగమణిని భద్రాది కొత్తగూడం కాలేజీ ప్రిన్సిపల్‌గా, గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్‌వోడీ ప్రొ.పి.శ్రావణ్‌కుమార్‌ను మహబూబాబాద్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా, బయోమెట్రిక్‌ ప్రొ.సులేమాన్‌ను మంచిర్యాల కాలేజీ ప్రిన్సిపల్‌గా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని