logo

Cyber Crime: లైక్‌లు కొట్టాలని.. రూ.31 లక్షలు స్వాహా

తాము చెప్పిన వీడియోలకు లైక్‌లు కొడితే లాభాలిస్తామని నమ్మించి రూ.31 లక్షలు దండుకున్నారని ఓ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 21 Dec 2021 08:49 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తాము చెప్పిన వీడియోలకు లైక్‌లు కొడితే లాభాలిస్తామని నమ్మించి రూ.31 లక్షలు దండుకున్నారని ఓ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. నగరానికి చెందిన మహిళ వాట్సాప్‌నకు ఓ లింక్‌ వచ్చింది. దానిపై క్లిక్‌ చేసిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి వాట్సాప్‌ కాల్‌ చేశాడు. ఈ సైట్‌లో మీరు ఖాతా తెరిచి కొంత పెట్టుబడి పెట్టి తాము పంపించే వీడియోలకు లైక్‌లు కొడితే.. ఒక్కో లైక్‌కు కొంత డబ్బు ఇస్తామని నమ్మించాడు. తమ కంపెనీ బ్రిటన్‌లో ఉండగా.. తన కార్యాలయం సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేట్‌లోనే ఉందన్నాడు. బాధితురాలు మొదట రూ.2.50 లక్షలు పెట్టగా వారం రోజుల్లో రూ.25 వేలు లాభం వచ్చింది. దాంతో బాధితురాలు విడతలవారిగా మొత్తం రూ.31 లక్షలు పెట్టేశారు. మొదట కొంత మొత్తం ఇచ్చినా.. తరువాత మానేయడంతో సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని