logo

పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు పోరాటం

పార్లమెంట్‌లో బీసీ బిల్లు కోసం పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా

Published : 26 May 2022 02:30 IST

కృష్ణయ్యకు పుష్పగుచ్ఛమిస్తున్న గుజ్జ సత్యం, చిత్రంలో గుజ్జ కృష్ణ

గోల్నాక, న్యూస్‌టుడే: పార్లమెంట్‌లో బీసీ బిల్లు కోసం పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్‌ వేయడానికి బయలుదేరిన ఆయన్ను బుధవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్‌ గుజ్జ కృష్ణతో కలిసి సన్మానించిన అనంతరం మాట్లాడారు. పార్లమెంట్‌లో బీసీల వాణిని బలంగా వినిపిస్తానని పేర్కొన్నారు.  ప్రైవేట్‌ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని