logo

సమీక్షిస్తూ.. సవాళ్లను అధిగమిస్తూ..

జిల్లా ప్రగతిలో జిల్లా పరిషత్‌ (జడ్పీ) పాత్ర కీలకం. వివిధ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా పర్యవేక్షిస్తుంది. పరిపాలనా సౌలభ్యం, అధికార యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ

Published : 07 Jul 2022 02:06 IST

ప్రగతి పథంలో జిల్లా పరిషత్తు
మూడేళ్లు పూర్తి  

న్యూస్‌టుడే, వికారాబాద్‌: జిల్లా ప్రగతిలో జిల్లా పరిషత్‌ (జడ్పీ) పాత్ర కీలకం. వివిధ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా పర్యవేక్షిస్తుంది. పరిపాలనా సౌలభ్యం, అధికార యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మొదట జిల్లాల పునర్విభజన చేపట్టింది. అనంతరం 2019 జులై 5న వికారాబాద్‌ జిల్లా పరిషత్తు ఆవిర్భవించింది. మూడేళ్లు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా దీని తీరుతెన్నులపై ‘న్యూస్‌టుడే’ కథనం.

పలు విషయాల్లో ఆదర్శం
జిల్లా పరిషత్‌ అనేక అంశాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. తనదైన ముద్ర వేస్తోంది. వివిధ స్థాయిల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం, ప్రజల సమష్టితత్వం చక్కటి ఫలితాలను అందించేందుకు దోహదం చేస్తోంది. వివిధ స్థాయిల్లో అధికారులు నిర్వహిస్తున్న సమీక్షలు, జిల్లా పరిషత్తు స్థాయి సంఘ, సర్వసభ్య సమావేశాలు జిల్లా అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ప్రతి రెండు మాసాల్లో ఒకమారు ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా, శిశు సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమశాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రగతి పనులపై స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు జడ్పీటీసీ సభ్యులు ఆయా కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలలకోసారి జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తూ వివిధ అంశాలపై ప్రస్తావిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, జిల్లాలోని వివిధ స్థాయిల్లో సమస్యలు ప్రస్తావించి పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. వివిధ అంశాలపై సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటూ, అవసరమైన నిధుల కేటాయింపులు చేపడుతున్నారు.  


రూపురేఖలు మారనున్నాయి..
సునీతారెడ్డి, అధ్యక్షురాలు, జిల్లా పరిషత్తు  

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన, ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తూ ప్రగతిలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో తొలి జిల్లా పరిషత్తు కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 కోట్లను మంజూరు చేసింది. పనులు కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం, ప్లాస్టిక్‌ నిషేధం తదితర కార్యక్రమాలు చేపట్టడంలో ముందు వరుసలో ఉన్నాం. అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జాప్యం లేకుండా చేపడుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని