logo

పండుగలా వజ్రోత్సవాల నిర్వహణ: మంత్రి సబిత

వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో జరపాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. మంగళవారం పురపాలక సంఘం పరిధిలోని మద్గుల్‌చిట్టెంపల్లి డీపీఆర్‌సీ భవనంలో డ్వాక్రా సంఘాల మహిళలకు జాతీయ

Published : 10 Aug 2022 01:13 IST

కలెక్టర్‌ భవనాన్ని పరిశీలిస్తున్న మంత్రి సబితారెడ్డి. చిత్రంలో  కలెక్టర్‌  నిఖిల, ఎమ్మెల్యేలు, తదితరులు  

వికారాబాద్‌, న్యూస్‌టుడే: వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో జరపాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. మంగళవారం పురపాలక సంఘం పరిధిలోని మద్గుల్‌చిట్టెంపల్లి డీపీఆర్‌సీ భవనంలో డ్వాక్రా సంఘాల మహిళలకు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెల్ల దొరల పాలన నుంచి విముక్తి పొంది 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వజ్రోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం సిరిసిల్ల కేంద్రంగా 1.2 కోట్ల జెండాలను తయారు చేయించిందని, వికారాబాద్‌ జిల్లాలో 2,47,692 మందికి జెండాలను పంపిణీ చేస్తారని అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా 10 లక్షల మందికి అదనంగా పింఛన్లు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం సీఎం ప్రారంభించనున్న కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, వికారాబాద్‌, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేష్‌రెడ్డి, యాదయ్య, జిల్లా కలెక్టర్‌ నిఖిల, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జడ్పీ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని