logo

తీగల వంతెనపై సైక్లింగ్‌.. ట్రాఫిక్‌ మళ్లింపు

సైక్లింగ్‌ కమ్యూనిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 1000 మంది రైడర్లు మాదాపూర్‌ తీగల వంతెనకు చేరుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Published : 24 Sep 2022 02:59 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: సైక్లింగ్‌ కమ్యూనిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 1000 మంది రైడర్లు మాదాపూర్‌ తీగల వంతెనకు చేరుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉ.5 నుంచి 8 గంటల వరకు వంతెనపై ట్రాపిక్‌ను అనుమతించకుండా ప్రత్యామ్నాయదారుల్లో మళ్లిస్తున్నట్లు సైబరాబాద్‌ డీసీపీ(ట్రాఫిక్‌) శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా వెళ్లండి.. రోడ్‌ నం.45 నుంచి ఐటీసీ కోహినూర్‌ హోటల్‌, ఐకియా, బయోడైవర్సిటీ కూడలి మీదుగా గచ్చిబౌలి వైపునకు వచ్చే వాహనదారులు కావూరిహిల్స్‌, మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌, ఎడమ వైపు మళ్లి సీఓడీ కూడలి, దుర్గంచెరువు, ఐటీసీ కోహినూర్‌, అక్కడి నుంచి నేరుగా ఐకియా రోటరీ చేరుకుని ఎడమ మలుపు, బయోడైవర్సిటీ పార్కు కూడలి నుంచి గచ్చిబౌలి వైపునకు వెళ్లాలి. * ఐకియా రోటరీ నుంచి తీగల వంతెన- రోడ్‌ నం.45- జూబ్లీహిల్స్‌  వైపునకు వచ్చే ట్రాఫిక్‌ను ఇనార్బిట్‌ మాల్‌, ఐ ల్యాబ్స్‌, సీఓడీ జంక్షన్‌, కుడి మలుపు తిప్పి మాదాపూర్‌ ఠాణా మీదుగా మళ్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని