logo

జేఎన్‌టీయూలో వాతావరణ మార్పుల గుర్తింపు పరికరం

సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు పరిష్కారం చూపే మార్గాలను అన్వేషించాలని జేఎన్‌టీయూ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి అన్నారు.

Published : 29 Sep 2022 03:38 IST


పరికరాన్ని ప్రారంభిస్తున్న వీసీ నరసింహారెడ్డి, నీటివనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ప్రకాష్‌

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు పరిష్కారం చూపే మార్గాలను అన్వేషించాలని జేఎన్‌టీయూ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి అన్నారు. ఐఎస్‌టీ సెంటర్‌ ఫర్‌ వాటర్‌ రిసోర్స్‌ విభాగం ఆధ్వర్యంలో బుధవారం వాతావరణ మార్పులపై నిర్వహించిన ఒకరోజు కార్యశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వర్సిటీలో అమెరికా బ్రాంక్స్‌ కమ్యూనిటీ కాలేజీ సహకారంతో ఏర్పాటుచేసిన వాతావరణ మార్పుల గుర్తింపు పరికరాన్ని ఆయన రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ప్రకాష్‌తో కలిసి ప్రారంభించారు.   ఐఎస్‌టీ నీటి వనరుల విభాగం అధినేత ఎం.వి.ఎస్‌.ఎస్‌.గిరిధర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రెక్టార్‌ గోవర్థన్‌, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, ఐఎస్‌టీ డైరెక్టర్‌ శశికళ, కళాశాల ప్రిన్సిపల్‌ జయలక్ష్మి, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ సలీల్‌ కదేర్‌, అమెరికా సీయూఎన్‌వై యూనివర్సిటీ అధ్యక్షుడు థామస్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని