logo

ఇ-కామర్స్‌.. పండగ జోష్‌

నగరంలో పండగ జోష్‌ మొదలైంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ వ్యాపారమూ ఊపందుకుంటోంది. నగరవాసులు ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు ఇతరాలను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేందుకుఇష్టపడుతున్నారు.

Published : 30 Sep 2022 03:29 IST

రూ.100 కోట్లకు పైగా బిజినెస్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పండగ జోష్‌ మొదలైంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ వ్యాపారమూ ఊపందుకుంటోంది. నగరవాసులు ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు ఇతరాలను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేందుకుఇష్టపడుతున్నారు. పండగ ఆఫర్‌గా 20 శాతం నుంచి 50 శాతం రాయతీలు ప్రకటిస్తుండటంతో ఆకర్షితులవుతున్నారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది 10శాతం వ్యాపారం వృద్ధి చెందిందని ఇ-కామర్స్‌ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. నచ్చిన మొబైల్‌, పూజా సామగ్రి, పిండి వంటలన్నీ లభిస్తుండటంతో ఆన్‌లైన్‌లో షాపింగ్‌కే మొగ్గుచూపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలతో కొందరు మహిళలు ఇ-కామర్స్‌ వ్యాపారం చేస్తుండటం, అందుబాటు ధరలతో ఎక్కువ మంది ఆసక్తిచూపుతున్నారు. ఈ సీజన్‌లో రూ.150 కోట్ల వ్యాపారం జరిగే అవకాశముందని అంచనా. గత నెలతో పోల్చితే ఈ నెలలో ఆర్డర్లు పెరిగాయని ప్రతిరోజు 25-30 ఆర్డర్లు అందజేస్తున్నట్లు డెలివరీ బాయ్స్‌ చెబుతున్నారు. మరోవైపు కొందరు వ్యాపారులు ‘క్లియరెన్స్‌ సేల్‌’ పేరుతో తమకు గిట్టుబాటయ్యేలా ఆన్‌లైన్‌ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇ-కామర్స్‌ సంస్థలు ‘అఫ్లియేటివ్‌’, ‘బిజినెస్‌ సెల్లర్‌’ విధానంతో ప్రోత్సహిస్తుండటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని