logo

పని చేయని పైపులైన్లకు.. ప్రాణం పోసేలా!

పూడిపోయిన భూగర్భ పైపులైన్ల పునరుద్ధరణకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. నగరంలోనే ముంపు సమస్య అధికంగా ఉన్న ఎల్బీనగర్‌ జోన్‌ను ఇంజినీర్లు ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. మూతపడ్డ పైపులైన్లను గుర్తించి, వాటిని ‘హారిజాంటల్‌ బోరింగ్‌’ విధానంతో

Published : 01 Oct 2022 03:11 IST

‘హారిజాంటల్‌ బోరింగ్‌’తో పునరుద్ధరణకు జీహెచ్‌ఎంసీ ప్రయోగం

ఈనాడు, హైదరాబాద్‌: పూడిపోయిన భూగర్భ పైపులైన్ల పునరుద్ధరణకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. నగరంలోనే ముంపు సమస్య అధికంగా ఉన్న ఎల్బీనగర్‌ జోన్‌ను ఇంజినీర్లు ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. మూతపడ్డ పైపులైన్లను గుర్తించి, వాటిని ‘హారిజాంటల్‌ బోరింగ్‌’ విధానంతో శుభ్రం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ విధానం విజయవంతమైతే సమస్యాత్మక కాలనీలకు పరిష్కారం లభిస్తుందని, రహదారుల ముంపును చాలా వరకు తగ్గించవచ్చని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.

నిండా మట్టి..

భూగర్భ పైపులైన్లలో మట్టి నిండి ఉండటంతో ‘హారిజాంటల్‌ బోరింగ్‌’ సరైందని అధికారులు చెబుతున్నారు. భూమికి సమాంతరంగా రంధ్రం వేసే యంత్రాలు తీసుకొచ్చి, పైపులైన్లలో వ్యర్థాలు బయటకు తీస్తామంటున్నారు.

రహదారులు తవ్వకుండా..

ప్రస్తుతం పనిచేయని పైపులైన్లను పునరుద్ధరించాలంటే.. రోడ్లను తవ్వి, పాతవి తొలగించి, కొత్తవి వేస్తున్నారు. దాని వల్ల వాహనదారులకు అసౌకర్యం తలెత్తుతోంది. ఖర్చు పెరుగుతోంది. హారిజాంటల్‌ బోరింగ్‌ సాంకేతికతతో రోడ్లను తవ్వకుండా పైపులైన్లకు జీవం పోయొచ్చని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది. వర్షాకాలం పూర్తయ్యాక పనులు చేపడతామని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని