logo

లక్ష్య సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలి: కలెక్టర్‌

జిల్లాలోని బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల అన్నారు.

Published : 01 Dec 2022 02:37 IST

బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ నిఖిల, అదనపు కలెక్టర్‌

రాహుల్‌ శర్మ,  బ్యాంక్‌ అధికారులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా మొత్తం క్రెడిట్‌ ప్లాన్‌ ప్రకారం రూ.6644 కోట్ల రుణాలను పంపిణీ చేయాలన్న లక్ష్యం కాగా రూ.1815 కోట్లు పంపిణీ చేశారన్నారు. సెప్టెంబర్‌ నెల లోపు వ్యవసాయ రుణాల కింద రూ.3440 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం కాగా రూ.1075 కోట్లు అందించారన్నారు.

2023-24 సంవత్సరానికి జిల్లాకు రూ.6362 కోట్ల క్రెడిట్‌ ప్లాన్‌ను రూపొందించారని వెల్లడించారు. కొన్ని బ్యాంకర్లు లక్ష్యాలను సాధించటంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారన్నారు. అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ మాట్లాడుతూ ప్రతి వ్యాపారి నగదు రహిత లావాదేవీలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అనంతరం 2023-24 రుణ ప్రణాళిక బుక్‌లెట్‌ను కలెక్టర్‌ బ్యాంక్‌ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ కృష్ణన్‌, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్‌, ఆర్బీఐ ఎల్డీఎం తేజ్‌దీప్‌, నాబార్డ్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌, బ్యాంక్‌ అధికారులు రాంబాబు, రామకృష్ణ, సుభాష్‌, జిల్లా అధికారులు కోటాజీ, బాబుమోజెస్‌, సుధారాణి, మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వేగంగా మన ఊరు.. మన బడి

మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు వేగవంతం చేసి ఈనెల 15 లోగా పూర్తి చేయాలని నిఖిల తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మన ఊరు.. మన బడి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 37 పాఠశాలల్లో చేట్టిన పనులు పూర్తి చేసి రంగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి, సెక్టోరియల్‌ అధికారి రవికుమార్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని