logo

మేం దొంగలమా? నేరస్థులమా?

జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను గ్రీన్‌ల్యాండ్స్‌ కూడలి వద్ద అరెస్టు చేసిన పోలీసులు ఎస్సార్‌నగర్‌ ఠాణాకు తరలించారు.

Published : 23 Jan 2023 02:15 IST

ఎస్సార్‌నగర్‌ ఠాణా మెట్లపై ఉపాధ్యాయులు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను గ్రీన్‌ల్యాండ్స్‌ కూడలి వద్ద అరెస్టు చేసిన పోలీసులు ఎస్సార్‌నగర్‌ ఠాణాకు తరలించారు. సుమారు 60 మంది ఉపాధ్యాయులను అడ్డుకున్న పంజాగుట్ట పోలీసులు వారిని వాహనాల్లో ఎస్సార్‌నగర్‌కు తీసుకొచ్చారు. సాయంత్రం ఉపాధ్యాయులందరినీ విడుదల చేస్తామని చెప్పిన పోలీసులు ఒక్కొక్కరి ఫొటో తీసుకోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేశారు. తామేమైనా దొంగలమా? నేరస్థులమా? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా ఉద్యమిస్తుంటే ఒక్కొక్కరిని గదిలోకి తీసుకుపోయి ఫొటోలు తీయడమేంటని ఉపాధ్యాయురాలు చాముండేశ్వరి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని