logo

కీసరగుట్ట రామలింగేశ్వరుడి దర్శనానికి ఆన్‌లైన్‌ టికెట్లు

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దర్శనానికి తొలిసారి ఆన్‌లైన్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

Published : 28 Jan 2023 02:59 IST

ప్రసంగిస్తున్న మంత్రి మల్లారెడ్డి, వేదికపై కలెక్టర్‌ హరీశ్‌ తదితరులు

మేడ్చల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దర్శనానికి తొలిసారి ఆన్‌లైన్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శామీర్‌పేటలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎస్‌.హరీశ్‌ అధ్యక్షతన సమీక్ష నిర్వహించి మంత్రి మాట్లాడారు. బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయని,  ఆన్‌లైన్‌లో రూ.2వేలు చెల్లించి నలుగురు భక్తులు స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు. కానుకలు, డబ్బు సమర్పించేందుకు గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య వేడుకలకు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారని కలెక్టర్‌ చెప్పారు. అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, రెవెన్యూ అధికారి లింగ్యానాయన్‌, కీసర ఆర్డీవో రవి, ఆలయ కమిటీ ఛైర్మన్‌ రమేశ్‌శర్మ, ఈవో సుధాకర్‌రెడ్డి, సర్పంచి మాధురి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని