logo

29న శ్రీసరస్వతీ విద్యాపీఠం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

శ్రీసరస్వతీ విద్యాపీఠం స్వర్ణ జయంతి సందర్భంగా ఈనెల 29న (ఆదివారం) పూర్వ విద్యార్థుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 28 Jan 2023 19:46 IST

హైదరాబాద్‌: శ్రీసరస్వతీ విద్యాపీఠం స్వర్ణ జయంతి సందర్భంగా ఈనెల 29న (ఆదివారం) పూర్వ విద్యార్థుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ బండ్లగూడెం జాగీర్‌లోని శ్రీ శారదాధామంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులతో పాటు పూర్వ ఆచార్యులు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మన ఆలోచనలు, అనుభూతులు పంచుకోవడానికి, సామాజిక రంగంలో అనుభవం ఉన్న పెద్దల దిశానిర్దేశం పొందడానికి వీలుగా ఈ కార్యక్రమం రూపొందించినట్టు పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్రం అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు, విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచారక్‌ లింగం శ్రీధర్‌, శ్రీసరస్వతీ విద్యాపీఠం అధ్యక్షులు, మణిపూర్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ తక్కలపల్లి తిరుపతిరావు,  శ్రీసరస్వతీ విద్యాపీఠం తెలంగాణ సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని