logo

వెంకటపతి రాజు మా కెప్టెన్‌

వెంకటపతి రాజు కెప్టెన్సీలో తాను క్రికెట్‌ ఆడానని చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు నగర  సీపీ సీవీ ఆనంద్‌.

Published : 01 Feb 2023 02:34 IST

వెంకటపతి రాజుతో కలిసి బెలూన్లు ఎగురవేస్తున్న నగర సీపీ సీవీ ఆనంద్‌

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: వెంకటపతి రాజు కెప్టెన్సీలో తాను క్రికెట్‌ ఆడానని చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు నగర  సీపీ సీవీ ఆనంద్‌. పాతబస్తీ షంషీర్‌గంజ్‌లో శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని విద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీడామైదానాన్ని మంగళవారం సీవీ ఆనంద్‌ భారత జట్టు పూర్వ క్రికెటర్‌ వెంకటపతిరాజుతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..అండర్‌-19 క్రికెట్‌ మ్యాచ్‌లో వెంకటపతి రాజు కెప్టెన్సీలో తాను క్రికెట్‌ ఆడి, సెంచరీ కొట్టానని తెలిపారు. శారదా విద్యాలయాన్ని వందేళ్లుగా సేవాభావంతో నిర్వహించడం అభినందనీయమన్నారు. వెంకటపతి రాజు మాట్లాడుతూ..విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. శారదా విద్యాలయ ట్రస్టీ జయంత్‌ ఠాగూర్‌,  నోహ్‌ సాఫ్ట్‌ వ్యవస్థాపకుడు శ్రీమైనేని,  రమా మాదిరెడ్డి, జ్యోత్స్న అంగారా పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు