పెద్దసార్లూ నాడి పట్టండి!
నిమ్స్‌లోని కొన్ని విభాగాల్లో ఓపీ భారమంతా సూపర్‌స్పెషాలిటీ పీజీ వైద్య విద్యార్థులపైనే పడుతోంది. కొందరు ప్రొఫెసర్లు, సీనియర్ ప్రొఫెసర్లు ఓపీల ముఖం చూడడం లేదు.
నిమ్స్‌లో ఓపీకి రాని కొందరు సీనియర్లు
పనిభారంతో కోర్సు నుంచి వైదొలగిన నలుగురు పీజీలు
ఈనాడు, హైదరాబాద్: నిమ్స్‌లోని కొన్ని విభాగాల్లో ఓపీ భారమంతా సూపర్‌స్పెషాలిటీ పీజీ వైద్య విద్యార్థులపైనే పడుతోంది. కొందరు ప్రొఫెసర్లు, సీనియర్ ప్రొఫెసర్లు ఓపీల ముఖం చూడడం లేదు. వారు కేవలం సర్జరీలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఒత్తిడి భరించలేక.. రెండు విభాగాల్లో 4 నెలలకే నలుగురు సూపర్‌స్పెషాలిటీ పీజీలు కోర్సుల నుంచి వైదొలగడం చర్చకు దారి తీస్తోంది. కేవలం పీజీ వైద్యులపైనే ఆధార పడడంతో సేవల్లో జాప్యం నెలకొంటోంది. కీలకమైన ఓ విభాగంలో ఇటీవల డీఎం కోర్సు తొలి ఏడాది విద్యార్థులు ముగ్గురు సీటు వదులుకున్నారు. పనిభారంతో పాటు సీనియర్ వైద్యుల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఒప్పంద పత్రం(బాండ్) రద్దు చేసుకొని రూ.5లక్షల జరిమానా చెల్లించినట్లు సమాచారం. మరో విభాగంలోనూ ఓ పీజీ వైద్యుడు.. పనిచేయలేనంటూ వెళ్లిపోయాడు.
నిత్యం మూడు వేల మంది..
కొవిడ్ తర్వాత నిత్యం ఔట్ పేషెంట్(ఓపీ)కి 3000 మంది వరకు వస్తుంటారు. కీలక విభాగాల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. వారిని తొలుత పీజీ వైద్యుడు పరిశీలించి సీనియర్ వైద్యుల వద్దకు పంపుతారు.కొందరు విభాగాధిపతులు ఓపీకి రావట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ వైద్యులు రోగి పరిస్థితి సమీక్షించి సంబంధిత వార్డుకు తరలించాలి. కానీ ఇక్కడ పీజీ వైద్యులే దిక్కు. కొన్ని విభాగాల్లో వారానికి వారు 100 గంటలు అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటున్నారు.
రాత్రి వేళ ఇంకా కష్టం..
రాత్రి వేళలో తప్పనిసరిగా సహాయ ప్రొఫెసర్ విధుల్లో ఉండాలి. ఆ విభాగాధిపతి ప్రతిరోజు సమన్వయం చేసుకోవాలి. ఆ రోజు విధుల్లో ఎవరుంటున్నారో విషయాన్ని వార్డులో పొందుపరుచడంతోపాటు ఆస్పత్రి డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్‌కి సమాచారం ఇవ్వాలి. ఈ పరిస్థితి చాలా విభాగాల్లో కన్పించడం లేదు. ఆర్‌ఐసీయూలో మినహాయించి ఐసీయూల్లో కూడా రెసిడెంట్ వైద్యులే పర్యవేక్షించాల్సిన పరిస్థితి. పనిభారంతో అకడమిక్ కార్యకలాపాలకు దూరమవుతున్నట్లు కొందరు పీజీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* సూపర్‌స్పెషాలిటీ పీజీ వైద్యులు (మొదటి,రెండో, చివరి ఏడాది కలిపి) 400
* సీనియర్ వైద్యులు, విభాగాధిపతులతో కలిపి సుమారు 300
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం