నృత్యం.. వికాసం ఉపాధికి కొత్త మార్గం
మనం రాకెట్ కంటే వేగంగా ప్రయాణిస్తున్నా సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోం. పండుగలు ఉల్లాసంగా నిర్వహిస్తాం. సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన సంగీతం, నృత్యం, నాటకం వంటివాటిపై ఆసక్తి తగ్గించుకుంటున్నాం
పురస్కారం అందుకున్న ప్రొఫెసర్ అనురాధ
ఈనాడు, హైదరాబాద్ : మనం రాకెట్ కంటే వేగంగా ప్రయాణిస్తున్నా సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోం. పండుగలు ఉల్లాసంగా నిర్వహిస్తాం. సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన సంగీతం, నృత్యం, నాటకం వంటివాటిపై ఆసక్తి తగ్గించుకుంటున్నాం.... ఈ మార్పులు గమనించిన కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ అనురాధ తడకమళ్ల దశాబ్దం నుంచి కూచిపూడి నృత్యంపై ప్రస్తుత.. భవిష్యత్ తరాలవారికి అవగాహన కలిగేలా చేస్తున్నారు. కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తున్న వారికి విద్యాభ్యాసం పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేస్తున్నారు. పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. కూచిపూడి నృత్యంపై పలు పుస్తకాల్లో కొన్ని భాగాలు రాశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అవార్డు పొందిన ఆమె కూచిపూడి నృత్యం.. ప్రస్తుత, భవిష్యత్ పరిస్థితులపై ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
సినిమాలకు దీటుగా ఉంటేనే..
నృత్య ప్రదర్శనలకు ఆదరణ తగ్గడం, తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినోద సాధనంగా సినిమా మారిపోవడంతో సంప్రదాయ కళలు, కూచిపూడి నృత్య ప్రభావం కనుమరుగవుతోంది. నాణేనికి మరోవైపుచూస్తే.. ఇప్పటితరం పిల్లల్లోనూ కూచిపూడి నృత్యం నేర్చుకోవాలన్న అభిలాష ఉంది. కొందరు తల్లిదండ్రులు వారికి శ్రద్ధగా నేర్పిస్తూ ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఈ ప్రదర్శనలు వందలు..వేలు కావాలి.. అప్పుడే చలనచిత్రాలకు దీటుగా నృత్యం నిలబడుతుంది. కూచిపూడి నృత్యం పునర్వైభవం కోసం మేం విదేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నాం. షికాగోలో గతేడాది డాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్నాం. కూచిపూడి నృత్యానికి సాంకేతిక హంగులు అద్దుతుండడంతో క్రమంగా ప్రదర్శనలు పెరుగుతున్నాయి. మా విద్యార్థులతో కలిసి ‘మహాకాల్’ పేరుతో శక్తి స్వరూపిణి నృత్య రూపకాన్ని సృష్టించాం. కాలానికి సంబంధించి ప్రతి అంశాన్ని ఈ నృత్యరూపకంలో వివరించాం.
అవకాశాలు అపారం..
కూచిపూడి నృత్య ప్రాధాన్యాన్ని తెలుసుకుని కొన్నేళ్లుగా విద్యార్థులు ఇందులో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కూచిపూడి నృత్యం అభ్యసించిన విద్యార్థుల్లో 90శాతం మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కొందరు డ్యాన్స్ స్కూళు ఏర్పాటుచేసుకుంటుండగా కొందరు ఇక్కడి ఇంటర్నేషనల్ స్కూళ్లలో అధ్యాపకులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. కరోనాతో ఉత్పన్నమైన మానసికఒత్తిడి తగ్గించుకునేందుకు కొందరు వైద్యులు, ఇంజినీర్లు ఈ నృత్యం నేర్చుకుంటున్నారు. తాజా పరిణామాలు గమనించి శరీర భంగిమల్లో మార్పులు, చేర్పులపై దృష్టి కేంద్రీకరించాం. దీంతో మరింతమంది యువత ఆసక్తి ప్రదర్శిస్తారన్న నమ్మకం కలిగింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Allu Arjun: వరుణ్-లావణ్య నిశ్చితార్థం.. మా నాన్న ఆనాడే చెప్పారు: అల్లు అర్జున్
-
Sports News
WTC Final: పిచ్ పరిస్థితి అలా ఉంది.. అదే జరిగితే 450 కూడా కొట్టొచ్చు: శార్దూల్
-
General News
Avinash Reddy: ఏడు గంటలపాటు సాగిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ
-
India News
Smriti Irani: జర్నలిస్టును ‘బెదిరించిన’ స్మృతి ఇరానీ.. వీడియో షేర్ చేసిన కాంగ్రెస్
-
Sports News
WTC Final: వారి ఆటతీరు.. టాప్‌ఆర్డర్‌కు గుణపాఠం: సౌరభ్ గంగూలీ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు