logo

భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ వీక్షణకు భాగ్యనగరం సిద్ధం.. భారీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం

ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ తలపడే మ్యాచ్‌ కోసం నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాయాదుల మధ్య మ్యాచ్‌ అంటే ప్రతి బంతి ఉత్కంఠే. నాలుగు గోడల మధ్య కంటే డీజే హోరులో భారీ తెరపై వీక్షించాలని ఊవ్విళ్లుతున్నారు.

Updated : 14 Oct 2023 08:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ తలపడే మ్యాచ్‌ కోసం నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాయాదుల మధ్య మ్యాచ్‌ అంటే ప్రతి బంతి ఉత్కంఠే. నాలుగు గోడల మధ్య కంటే డీజే హోరులో భారీ తెరపై వీక్షించాలని ఊవ్విళ్లుతున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి మొదలయ్యే మ్యాచ్‌ కోసం నగరంలోని పలు హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లలో భారీ తెరలపై  ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

క్రికెట్‌ అభిమానులు ప్రపంచకప్‌ మొదలైనప్పటి నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పైగా వారాంతం రావడంతో అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. స్నేహితులతో కలిసి చిల్‌ అవుతూ మ్యాచ్‌ వీక్షించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు.  వీరికి మరింత వినోదం పంచేందుకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సిద్ధమయ్యాయి.

హైటెక్స్‌లో ఇప్పటివరకు డిసెంబరు 31 వేడుకలను చూశాం. ఈసారి భారత్‌, పాక్‌ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారంతో పాటూ డీజేతో జోష్‌ను మరింత పెంచనున్నారు. హీరోయిన్‌ శ్రీయ కూడా వేడుకలో పాల్గొని అంధ క్రికెటర్లకు క్రికెట్‌ కిట్లు పంపిణీ చేయనున్నారు.

పిల్లలకు సెలవులతో మరింత జోష్‌.. విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి మ్యాచ్‌ వీక్షించేందుకు పెద్దలు సిద్ధమయ్యారు. గేటెడ్‌ కమ్యూనిటీలో భారీ తెరలపై వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌ గెలిస్తే దసరా నవరాత్రుల్లోనే దీపావళి టపాసుల మోత మెగించేందుకు అభిమానులు సిద్ధం చేసి పెట్టుకున్నారు.

తరలివెళ్లారు.. అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌ కోసం ఎంతోముందుగానే టికెట్లు బుక్‌ చేసుకున్న నగరంలోని క్రికెట్‌ అభిమానులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వీరిలో పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. వీరంతా స్టేడియంలో తళుక్కున మెరవనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని