logo

కరోనా తర్వాత పెరిగిన ఎక్మో అవసరం: యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌

భారత దేశంలో కరోనా మహమ్మారి తర్వాత ఎక్మో(ఈసీఎంఓ) అవసరం  పెరిగిపోయిందని యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌గోరుకంటి అన్నారు.

Updated : 21 Jan 2024 09:15 IST

మాట్లాడుతున్న పవన్‌గోరుకంటి

మాదాపూర్‌, న్యూస్‌టుడే: భారత దేశంలో కరోనా మహమ్మారి తర్వాత ఎక్మో(ఈసీఎంఓ) అవసరం  పెరిగిపోయిందని యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌గోరుకంటి అన్నారు. మాదాపూర్‌లోని యశోద హాస్పిటల్స్‌ హైటెక్‌సిటీ, ఎక్మో సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఎక్మోపై 13వ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌(ఈసీఎంఓ) అనేది తీవ్రంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, గుండెకు అత్యంత ఆధునాతనమైన లైఫ్‌ సేవింగ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌లలో ఒకటి అని చెప్పారు. 40 ఏళ్ల క్రితమే ఎక్మోకు రూపకల్పన జరిగినా.. అప్పట్లో ఉపయోగించడం చాలా తక్కువగా ఉండేదన్నారు. ఇప్పుడు ఈ పరికరం అత్యంత ఆధునికంగా అందుబాటులోకి రావడంతో గుండె, ఊపిరితిత్తులు పని చేయనప్పుడు మరింత ఆధారపడదగిందిగా తయారైందని చెప్పారు. సదస్సుకు వివిధ దేశాల నుంచి 20 మంది అంతర్జాతీయ అధ్యాపకులు, వంద మంది భారతదేశ నిపుణులు హాజరై తమ అనుభవాలు పంచుకుంటున్నారని తెలిపారు. యశోద హాస్పిటల్స్‌ సీనియర్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ డా.వెంకట్‌ రామన్‌ కోలా మాట్లాడుతూ.. మరణం అంచు నుంచి మళ్లీ నిండు జీవితం వైపు మళ్లించే పరికరం ఎక్మో అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని