logo

హామీలు అమలు చేస్తాం: కాంగ్రెస్‌

చేవెళ్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఓటర్లను కోరారు. పట్టణంలోని 2,3,4,5,6,25 వార్డులలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు.

Published : 10 May 2024 03:34 IST

ప్రచారంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి  

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: చేవెళ్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఓటర్లను కోరారు. పట్టణంలోని 2,3,4,5,6,25 వార్డులలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల హమీలు తప్పక నెరవేరుస్తున్నామన్నారు. మున్సిపల్‌ అధ్యక్షురాలు స్వప్న, కౌన్సిలర్లు నీరజ, ప్రభాకర్‌గౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

యాలాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గోనె  సంచులు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే బుయ్యని అధికారులను ఆదేశించారు. గురువారం రాస్నం గ్రామంలో పర్యటించిన బుయ్యనికి రైతులు గోనె సంచులు అందుబాటులో లేక వర్షానికి ధాన్యం కొంత మేర తడిసిందని తెలిపారు. వెంటనే ఆయన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాడిపత్రిలు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. అంతకుముందు యాలాల మండల కేంద్రంలో పేరి రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారాస, భాజపాకు చెందిన 120 మంది కార్యకర్తలను ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్‌, మండల పార్టీ అధ్యక్షులు నర్పిరెడ్డి పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న రామ్మోహన్‌రెడ్డి

సీపీఎస్‌ విధానంపై త్వరలో నిర్ణయం: టీఆర్‌ఆర్‌

పరిగి, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సీపీఎం విధానంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చేవెళ్ల పార్లమెంటు కో ఇంఛార్జి టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని బర్కత్‌పల్లి, రుకుంపల్లి గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. అనంతరం సీపీఎం, సీపీఐ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.  పార్లమెంట్‌ సమన్వయ కర్తలు విజయలక్ష్మి, సతీష్‌కుమార్‌, ధారాసింగ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు, ఉపాధ్యక్షులు లాల్‌క్రిష్ణప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షుడు పరశురాంరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని