logo

నిర్భయంగా ఓటేయండి

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తన ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి కె.శ్రీనివాసులు సూచించారు.

Published : 16 Apr 2024 06:31 IST

సాయుధ బలగాల కవాతులో కలెక్టర్‌, ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తన ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి కె.శ్రీనివాసులు సూచించారు. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్‌ నుంచి శ్రీనివాస సెంటర్‌, టెక్కె మార్కెట్‌యార్డు, సాయిబాబానగర్‌ మీదుగా దేవనగర్‌ వరకు సోమవారం కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు కవాతు నిర్వహించారు. ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో పద్మజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని బైండోవర్‌ చేసినట్లు వెల్లడించారు. డీఎస్పీ రవీంద్రనాథరెడ్డి, సీఐలు చలపతి, రాజారెడ్డి, నరసింహులు, ఇస్మాయిల్‌, దస్తగిరిబాబు, శివప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ఎన్నికల పరిశీలకుల రాక

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు త్వరలో పరిశీలకులు రానున్నట్లు కలెక్టర్‌, ఎన్నికల అధికారి డా.కె.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక తన ఛాంబర్‌లో సోమవారం ఆయన ఎన్నికల పరిశీలకులు, పోస్టల్‌ బ్యాలెట్‌, పోలింగ్‌ అధికారుల శిక్షణ కార్యక్రమాలపై లైజన్‌, సెక్టోరల్‌, నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. అత్యవసర సేవలు అందించే 33 విభాగాల ఉద్యోగులు, వ్యక్తులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు  డీఆర్వో పద్మజ, జిల్లా సహకార అధికారి వెంకటసుబ్బయ్య, సీపీవో వేణుగోపాల్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి బషీరున్నిసాబేగం, భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు రఘురాం, పరిశ్రమల జిల్లా మేనేజర్‌ శ్రీనివాస యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని