logo

పోస్టల్‌ బ్యాలెట్‌కు 14 వేల దరఖాస్తులు

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేసే అవకాశం కల్పించింది. గతంలో పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకుంటే తపాలా ద్వారా ఉద్యోగి ఇంటికి బ్యాలెట్‌ పత్రాలు పంపేవారు.

Published : 17 Apr 2024 02:28 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేసే అవకాశం కల్పించింది. గతంలో పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకుంటే తపాలా ద్వారా ఉద్యోగి ఇంటికి బ్యాలెట్‌ పత్రాలు పంపేవారు. వారు ఓటు వేసి తిరిగి పోస్టు ద్వారా నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి పంపేవారు. ప్రస్తుతం ఈ పద్ధతిలో మార్పులు జరిగాయి. ఉద్యోగికి బ్యాలెట్‌ పత్రాలు పంపకుండా.. నియోజకవర్గంలో మూడు రోజులపాటు ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటుచేసి.. అక్కడే ఉద్యోగులకు బ్యాలెట్‌ పత్రాలు అందజేసి ఓటేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి ఇప్పటివరకు 14 వేల దరఖాస్తులు వచ్చాయి. మరో 4 వేల దరఖాస్తులు వచ్చే అవకాశముంది. ప్రతి ఆర్వో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే ఫెసిలిటేషన్‌ కౌంటర్లోనే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసేవారికి మాత్రమే పోస్టు ద్వారా బ్యాలెట్‌ పత్రాలు పంపనున్నారు.

ఎన్నికల సిబ్బంది కోసం ఈ నెలాఖరు నుంచి మే మొదటి వారంలో అన్ని నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటుచేసి పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఓటేసే అవకాశం కల్పించనున్నారు. మూడు రోజులపాటు ఈ కేంద్రం కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని