logo

రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయం

రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. కర్నూలు మౌర్యఇన్‌లోని తన కార్యాలయంలో మంగళవారం...

Published : 17 Apr 2024 02:53 IST

మాట్లాడుతున్న కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. కర్నూలు మౌర్యఇన్‌లోని తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన బెస్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. అర్హులకు సంక్షేమ పథకాలు దూరమయ్యాయని పేర్కొన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక 217 జీవో రద్దు చేస్తామన్నారు. బెస్తల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతిస్తే ప్రజలకు అన్నివిధాలా మేలు చేస్తానని.. ప్రధానంగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అర్షద్‌, తెదేపా నేత రమేష్‌, బెస్త సాధికార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుభాష్‌ చంద్రబోస్‌, మత్స్యశాఖ మాజీ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌, జగన్‌, ముని, విజయ్‌, అర్జున్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

బెస్తల ఆత్మీయ సమావేశం అనంతరం కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు వెంకటేష్‌, వైకాపా నేత ఆనంద్‌ తమ వారితో కలిసి తెదేపాలో చేరారు. టీజీ భరత్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు