logo

Barrelakka: కొల్లాపూర్‌ బరిలో బర్రెలక్క.. యానాం మాజీ మంత్రి మల్లాడి విరాళం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష ఎన్నికల ప్రచారం కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, యానాం వాసి మల్లాడి కృష్ణారావు శనివారం రూ.లక్ష విరాళం పంపించారు.

Updated : 19 Nov 2023 09:00 IST

యానాం, న్యూస్‌టుడే : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష(Karne Sirisha) ఎన్నికల ప్రచారం కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, యానాం వాసి మల్లాడి కృష్ణారావు శనివారం రూ.లక్ష విరాళం పంపించారు. సోషల్‌ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే శిరీష అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీకాం డిగ్రీ చేసింది. చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో గేదెలు కాస్తుండటంతో బర్రెలక్కగా పేరుపొందిందని, కులమతాలకు అతీతంగా ధన ప్రభావం లేకుండా యువత ఎన్నికల్లో పోటీచేసి గెలవాలన్న లక్ష్యంతో బర్రెలక్క కొల్లాపూర్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారని, ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపానని మల్లాడి కృష్ణారావు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువత సహకారంతో ఆమెను గెలిపించాలన్నారు. ఫలితం ఎలా వచ్చినా.. నిరుత్సాహపడొద్దని, బీఈడీ వంటి కోర్సులు చదువుకోవాలని, పోటీ పరీక్షలకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే తాను అండగా నిలుస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని