logo

కమనీయం సీతారామస్వామి మాస కల్యాణోత్సవం

రెండో భద్రాదిగా పేర్గాంచిన చారకొండ మండలం శిర్సనగండ్లలోని రామాలయంలో శ్రీసీతారామచంద్రస్వామి మాస కల్యాణం మంగళవారం కనుల పండువగా నిర్వహించారు.

Published : 17 Apr 2024 05:43 IST

భక్తులకు తాళిబొట్టు చూపుతున్న ప్రధాన అర్చకుడు లక్ష్మణశర్మ

చారకొండ (వెల్దండ గ్రామీణం), న్యూస్‌టుడే : రెండో భద్రాదిగా పేర్గాంచిన చారకొండ మండలం శిర్సనగండ్లలోని రామాలయంలో శ్రీసీతారామచంద్రస్వామి మాస కల్యాణం మంగళవారం కనుల పండువగా నిర్వహించారు. ఏటా శ్రీరామనవమి ముందు రోజు సీతారాములకు ఈ వేడుక  నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయం నుంచి పల్లకీలో శ్రీసీతారాముల ఉత్సహ విగ్రహాలను, ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్‌లో శ్రీరాముడి విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో భజనలు, మంగళ వాయిద్యాలు, మహిళల మంగళహారతులతో ఊరేగింపు కొనసాగింది. సీతారామచంద్రస్వామి ఆలయానికి చేర్చగా కల్యాణ మండపంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛరణలతో మాసకల్యాణం వైభవంగా నిర్వహించారు. వెల్దండ సీఐ విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్సైలు రాజశేఖర్‌, రవి పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఛైౖర్మన్‌ ఢేరం రామశర్మ, ఆలయ ఇన్‌ఛార్జి ఈవో శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్‌ నిరంజన్‌, ఉపతహసీల్దార్‌ విద్యాధరిరెడ్డి, అర్చకులు లక్ష్మణశర్మ, మురళీధర్‌శర్మ, వేణుగోపాలశర్మ, అనంతశర్మ, గోపికృష్ణశర్మ, కోదండరామశర్మ నాయకులు వెంకట్రెడ్డి, సూదినిశేఖర్‌రెడ్డి, బాల్‌రామ్‌గౌడ్‌, దుర్గారెడ్డి, వెంకట్గౌడ్‌, నర్సింహరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని