logo

కాంగ్రెస్‌ అసమర్థ పాలనతో రైతులకు కష్టాలు: మాజీమంత్రి

కాంగ్రెస్‌ పార్టీ అసమర్థ పాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల కడలిలో చిక్కుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 16 Apr 2024 02:57 IST

 సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, వేదికపై నాయకులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి,
అభ్యర్థి క్యామ మల్లేశం, జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌

భువనగిరి, భువనగిరి గంజ్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ అసమర్థ పాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల కడలిలో చిక్కుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రజల గోస చూడలేక ప్రశ్నించి.. ప్రజా క్షేత్రంలోకి వెళ్లిన కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చే భారాస గెలుపునకు ప్రతి కార్యకర్త కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. భారాస భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సాయి కన్వెన్షన్‌ హాల్‌లో సోమవారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో భారాస జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌, జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య తదితరులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి  మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో సాగు-తాగు నీటికి ఇబ్బందులు లేకుండా, 24 గంటల కరెంట్‌ ఇచ్చి తెలంగాణను అన్నపూర్ణగా మార్చితే.. నాలుగు నెలల్లోనే పాలన చేతకాని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిందని దుయ్యబట్టారు. భారాస అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చే శక్తి వస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపొట్లు లేకుండా ఎంపీ ఎన్నికల్లో పనిచేయాలన్నారు. జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దని,  ఎంపీ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని,  వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదన్నారు.

  • కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌, బీబీనగర్‌ ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, కొల్పుల అమరేందర్‌, గాదె నరేందర్‌రెడ్డి, బీరుమల్లయ్య, ఆకుల ప్రభాకర్‌, మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, ఏవీ కిరణ్‌కుమార్‌, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, జనగాం పాండు, అఫ్జల్‌, సిద్దుల పద్మ, రత్నపురం పద్మ, పడమటి మమత తదితరులు పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని