logo

పొద్దంతా ఎండ.. రాత్రి వాన

జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు.

Updated : 18 Apr 2024 06:22 IST

కామారెడ్డి వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ ప్రాంతంలో 11 మిల్లీమీటర్లు, బీబీపేటలో 3.5, సదాశివనగర్‌లో 3.3, పాతరాజంపేటలో 3, మాచారెడ్డి మండలం లచ్చాపేటలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కురిసిన చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. జిల్లాకేంద్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులు వీచాయి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది.

జిల్లాలోని మిగితా ప్రాంతాల్లో 41 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. గాంధారి మండలం సర్వాపూర్‌లో అత్యల్పంగా 39.4 డిగ్రీలు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని