logo

ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ

పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్‌ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు.

Published : 24 Apr 2024 05:54 IST

నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి ఒకరే మహిళా ఎంపీ

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌: పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్‌ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. అసెంబ్లీలో కొంత ప్రాతినిధ్యం ఉన్నా.. లోక్‌సభకు వచ్చే సరికి వారి ప్రాతినిధ్యం అంతగా ఉండడం లేదు. మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా పదవుల్లో మాత్రం పురుషులే అధికంగా ఉన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతివలే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు ప్రారంభమైన నుంచి నేటి వరకు రాజకీయ పార్టీలు మహిళలకు టిక్కెట్లు కేటాయించడం లేదు. స్థానిక సంస్థల్లో సగం స్థానాలు మహిళలకు కేటాయించడంతో వారి ప్రాతినిధ్యం బాగానే ఉంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి 1952 నుంచి 17 సార్లు ఎన్నికలు జరుగగా ఇప్పటి వరకు ఒకరే ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెరాస(ఇప్పటి భారాస) కల్వకుంట్ల కవితను బరిలో దింపింది. కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులతో ఆమె హోరాహోరిగా తలపడి 1,67,184 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో మళ్లీ బరిలో నిలిచిన ఆమె భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ చేతిలో ఓడిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని