logo

డీజే పరికరాల స్వాధీనం

ప్రభుత్వ పాత ఐ.టి.ఐ.లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్న విద్యార్థులు డి.జె. సౌండ్‌ బాక్సులు పెట్టి అధిక శబ్ధాలు చేస్తుండడంతో స్థానికులు డయల్‌ 100 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Published : 02 Oct 2022 04:46 IST

ఐటీఐ వద్దకు వచ్చిన పోలీసులు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాత ఐ.టి.ఐ.లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్న విద్యార్థులు డి.జె. సౌండ్‌ బాక్సులు పెట్టి అధిక శబ్ధాలు చేస్తుండడంతో స్థానికులు డయల్‌ 100 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెం ప్రాంతంలోని ప్రభుత్వ పాత ఐ.టి.ఐ.లో చదువుతున్న వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఆయుధ పూజ చేయడం కోసం ప్రతి ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలు చేయడం ఆనవాయితీ. అదేవిధంగా ఈ ఏడాది కూడా విద్యార్థులు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సాహం నింపడం కోసం కొందరు విద్యార్థులు శనివారం పండగలో డి.జె. సౌండ్‌ బాక్సులు తీసుకువచ్చి పాటలు పెట్టారు. డీజే బాక్సుల ద్వారా పెద్ధ శబ్ధాలు రావడంతో స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంచరపాలెం పోలీసులు ప్రభుత్వ పాత ఐ.టి.ఐ.కు వెళ్లి పరిశీలించగా అక్కడ మూడు డీజేలతో పాటలు పెట్టుకొని విద్యార్థులు సందడి చేయడం కనిపించింది. దీంతో పోలీసులు వాటికి సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకొని, నిర్వాహకులపై టౌన్‌ న్యూసెన్స్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని