logo

జగన్‌కు బుద్ధి చెప్పడానికి.. జనం సిద్ధం

రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు.

Published : 29 Nov 2022 03:29 IST

తెదేపా నేత చలపతిరావు

సమావేశంలో మాట్లాడుతున్న చలపతిరావు, తెదేపా నాయకులు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు. అచ్యుతాపురంలో సోమవారం తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తెదేపా బూత్‌ ఇన్‌ఛార్జులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చలపతిరావు మాట్లాడుతూ ప్రజలపై మోయరాని పన్నులు వేయడమే ధ్యేయంగా జగన్‌ పాలన సాగుతోందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు రూపాయి ఇచ్చి రూ. పది లాగేసుకుంటున్నారని విమర్శించారు. మద్య నిషేధం అమలు మరచిపోయి, మద్యం అమ్మకాలు పెంచడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులను వేధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఉపాధ్యాయులకు అవసరం లేని పనులు అప్పగించి వారిపై పనిభారం పెంచారన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందన్నారు. జగన్‌ పాలనలో అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించడానికి బూత్‌ ఇన్‌ఛార్జులు ఇంటింటికీ తిరగాలన్నారు. శిక్షణ కార్యక్రమానికి హాజరైన రాబిన్‌ శర్మ మాట్లాడుతూ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనేది వివరించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి దూళి రంగనాయకులు, తెదేపా నాయకులు దిన్‌బాబు, గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, రామకృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని