logo

విశాఖలో సామూహిక 108 సూర్యనమస్కారాలు కార్యక్రమం

రథసప్తమి పర్వదినం సందర్భంగా విశాఖ నగరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలనే సదుద్దేశంతో స్థాపించబడిన ‘ఓం ఉచిత యోగా సెంటర్’ ఆధ్వర్యంలో సామూహిక 108 సూర్యనమస్కారాలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 28 Jan 2023 13:10 IST

విశాఖ: రథసప్తమి పర్వదినం సందర్భంగా విశాఖ నగరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలనే సదుద్దేశంతో స్థాపించబడిన ‘ఓం ఉచిత యోగా సెంటర్’ ఆధ్వర్యంలో సామూహిక 108 సూర్యనమస్కారాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం ఉచిత యోగా సెంటర్ వ్యవస్థాపకులు, జిల్లా యోగ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ చిలకా రమేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 150 మంది హాజరయ్యారు. ‘‘సూర్య భగవానుడు సమస్త జగత్‌కు ఎంత ఆధారమై ఉన్నాడో అలాగే ఈ సూర్య నమస్కారాలు మానసికంగా, ఆధ్యాత్మికంగా మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు యోగ చాలా ఉపయోగపడుతుంది. ఇవి మొత్తం 12 ఆసనాలు.. 12 స్థితులు.. 12 రాశుల్లో సూర్యుని స్థితిని సూచిస్తాయి. శరీరానికి నూతన ఉత్తేజాన్నిస్తాయి’’ అని చిలకా రమేశ్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రా యూనివర్సిటీ యోగా డైరెక్టర్ భాను కుమార్, జిల్లా యోగ ప్రెసిడెంట్ యోగా రాజు, ఓం యోగ సంస్థ ప్రెసిడెంట్ శాంతారామ్, సురేష్ బాబు, భాజపా జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, సెయిల్‌ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని