logo

జగనన్న కాలనీలో సర్పంచి ఇల్లు

తాటిపర్తి శివారు కాశీపురంలో సర్పంచి అల్లంగి గౌరీదేవి జగనన్న లేఅవుట్‌లో 4 సెంట్ల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు.

Published : 01 Feb 2023 05:25 IST

4 సెంట్ల స్థలంలో భారీ నిర్మాణం

పిల్లర్లతో నిర్మిస్తున్న ఇల్లు

మాడుగుల, న్యూస్‌టుడే: తాటిపర్తి శివారు కాశీపురంలో సర్పంచి అల్లంగి గౌరీదేవి జగనన్న లేఅవుట్‌లో 4 సెంట్ల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనిపై సోమవారం కలెక్టరు రవికి స్పందనలో ఫిర్యాదు చేసినట్లు ఈ గ్రామానికి చెందిన అల్లంగి శంకరరావు తెలిపారు. ఈ లేఅవుట్‌లో 41 మంది పేదలకు ఇళ్లు కేటాయించాలని ముందుగా నిర్ణయించారు. అయితే కేవలం 19 మందికే స్థలాలు కేటాయించారన్నారు. మిగిలిన స్థలంలో 4 సెంట్లు సర్పంచి తనకే కేటాయించుకుని 9 పిల్లర్లతో భారీగా ఇల్లు నిర్మిస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై సచివాలయ సర్వేయరు, వీఆర్‌వోను ప్రశ్నించగా ఉప తహసీల్దారు సత్యనారాయణ ఆదేశాల మేరకు స్థలం కేటాయింపు జరిగిందని వారు సమాధానం ఇచ్చారని శంకరరావు పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకుని, ఆ స్థలాన్ని ఇల్లు లేని వారికి కేటాయించాలని ఆయన కోరారు. దీనిపై గృహనిర్మాణ సంస్థ ఏఈ సత్యనారాయణను వివరణ కోరగా తాము చెబుతున్నా సర్పంచి భర్త నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేస్తున్నందున బిల్లు పెట్టలేదని చెప్పారు. ఉప తహసీల్దారు సత్యనారాయణను వివరణ కోరితే వివరాలతో తహసీల్దారుకు ఫిర్యాదు చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

సర్పంచికాక మునుపే ఇల్లు మంజూరు.. సొంతిల్లు లేక సర్పంచి కాక ముందే ఇల్లు కోసం దరఖాస్తు చేశాను. స్థలం, ఇల్లు మంజూరు చేశారు. గృహనిర్మాణ అధికారులు చెబితే కడుతున్నాను.   స్థలం ఆక్రమించి ఇల్లు కడుతున్నానడం సరికాదు.

గౌరి, సర్పంచి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని