logo

పాత పింఛను విధానం అమలయ్యే వరకూ పోరాటం

ప్రభుత్వ ఉద్యోగికి పింఛను హక్కు అని, పాత పింఛను విధానమే కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు.

Published : 27 Mar 2023 03:55 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల సంఘీభావం

డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగికి పింఛను హక్కు అని, పాత పింఛను విధానమే కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సంయుక్త సదస్సు ఆదివారం డాబాగార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో డిఫెన్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలిండియా స్టేట్‌ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌జీఈఎఫ్‌), ఏపీఎన్జీఓ అసోసియేషన్‌ నిర్వహించిన ఈ సదస్సులో డిఫెన్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఛైర్మన్‌ రెడ్డి వెంకటరావు మాట్లాడారు. ఆలిండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు, ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని