logo

పేలిన బాంబులు..ఎగిరిపడిన వాహనాలు

తంతడి-వాడపాలెం తీరంలో హీరో కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్న ‘డెవిల్‌’ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 1945 ముందు స్వాతంత్య్ర పోరాట కాలంనాటి కథగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌ ఫైట్‌ను తీరం వద్ద చిత్రీకరిస్తున్నారు.

Updated : 01 Apr 2023 12:30 IST

పేలుడు సన్నివేశం చిత్రీకరణ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: తంతడి-వాడపాలెం తీరంలో హీరో కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్న ‘డెవిల్‌’ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 1945 ముందు స్వాతంత్య్ర పోరాట కాలంనాటి కథగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌ ఫైట్‌ను తీరం వద్ద చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం జీపులు, లారీలు, ఫిరంగులు, సాయుధ బలగాలతో బ్రిటిష్‌వాళ్లు ముందుకు వెళ్తుండగా ల్యాండ్‌మైన్‌ పేలి జీపు 20 అడుగుల ఎత్తువరకు గాల్లో ఎగరడం, వెనుక చాలా బాంబులు ఒకదాని వెనుక మరొకటి పేలిపోవడాన్ని చిత్రీకరించారు. బాంబులు పేలి వాహనాలు గాల్లో ఎగరడం మొదటిసారి ప్రత్యక్షంగా చూసిన స్థానికులు సంబరపడ్డారు. ఈ సినిమా షూటింగ్‌ 75 శాతం వరకు పూర్తయిందని, ఈనెల 5వరకు ఇక్కడ చిత్రీకరణ ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని