వస్తున్నారు.. వెళ్తున్నారు!
విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కార్యదర్శిగా విధులకు డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు ఎక్కువ కాలం ఉండడం లేదు.
వీఎంఆర్‌డీఏ కార్యదర్శి వేణుగోపాల్ ఆకస్మిక బదిలీ
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కార్యదర్శిగా విధులకు డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు ఎక్కువ కాలం ఉండడం లేదు. కొద్ది నెలల్లోనే వెనక్కి వెళ్లిపోతున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. గతంలో వచ్చిన రఘునాథ రెడ్డి ఎక్కువకాలం ఉండ లేదు. తాజాగా టి.వేణుగోపాల్‌ది అదే పరిస్థితి. భూపరిపాలనశాఖ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చిన ఆయన ఆకస్మిక బదిలీ వీఎంఆర్‌డీఏలో తీవ్ర చర్చనీయాంశమైంది. బదిలీ నిలుపుదలకు ఓ ఉన్నతాధికారి ప్రయత్నించినా ఆగలేదని, రాజకీయ ఒత్తిళ్లే కారణమని సమాచారం.
ఆ స్థల వ్యవహారమేనా?: కొద్ది రోజుల కిందట వీఎంఆర్‌డీఏ పరిధిలోని ఖాళీ స్థలాలకు వేలం నిర్వహించారు. అదే క్రమంలో గతంలో వేలంలో దక్కించుకొని డబ్బులు చెల్లించకుండా అనుభవిస్తున్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలా అధికార పార్టీలోని ఓ ముఖ్యనేత అనుచరుడికి నోటీసులు వెళ్లాయి. అప్పట్లో ఆ స్థలం వద్ద వివాదమూ చోటుచేసుకుంది. దీంతో అధికారి బదిలీకి ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. వేణుగోపాలరావు భూపరిపాలనశాఖ నుంచి వీఎంఆర్‌డీఏకు నాలుగు నెలల క్రితం వచ్చారు. కొద్ది రోజుల్లోనే రెవెన్యూ వచ్చేలా కొన్ని ప్రణాళికలు అమలు చేశారు.
* పాత ప్లాట్ల విక్రయం, వాణిజ్య సముదాయాల నుంచి రావాల్సిన బకాయిల వసూలుపై దృష్టిసారించారు. దుకాణదారులకు నోటీసులు ఇచ్చి బకాయిలు వసూలు చేశారు. లేదంటే ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అలా మొత్తంగా గత మూడు నెలల్లో రూ.70 కోట్ల ఆదాయం వచ్చింది. ఏళ్లుగా దాకమర్రి లేఅవుట్‌లో ఎల్‌ఐజీ ప్లాట్ల కేటాయింపు జరగలేదు. కలెక్టర్ సహకారంతో అదీ పూర్తి చేశారు. ఎంఐజీ ప్లాట్ల వేలం, ఖాళీ స్థలాల విక్రయాలపై ఈ-కొనుగోలుకు వరసగా ప్రకటనలు ఇచ్చి తక్కువ సమయంలో ఎక్కువసార్లు వేలం నిర్వహించి ఆదాయం తీసుకొచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం