logo

రాయితీ బియ్యం డంపు స్వాధీనం

 అక్రమ రాయితీ బియ్యం డంపులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. 210 క్వింటాళ్ల రూ.5.25 లక్షల విలువ చేసే బియ్యం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ కథనం

Published : 22 May 2022 03:10 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే:  అక్రమ రాయితీ బియ్యం డంపులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. 210 క్వింటాళ్ల రూ.5.25 లక్షల విలువ చేసే బియ్యం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ కథనం మేరకు... కరీమాబాద్‌కు చెందిన మందల సంతోష్, శంభునిపేటకు చెందిన గొడిశాల మురళి, దుగ్గొండికి చెందిన చందు, చలవపల్లికి చెందిన కుచ రజినీకాంత్, ఆత్మకూరు మండలం కామారం గ్రామానికి చెందిన తక్కలపల్లి చిరంజీవి, రాధారపు ప్రశాంత్, నడికూడ మండలానికి చెందిన చెలుకుల రంజిత్‌కుమార్, జి.విజయ్‌కుమార్, కె.కృష్ణరాజ్, గోనెల రాజ్‌కుమార్, గోనెల వెంకటేశ్, గోనెల సంతోష్, గుజరాత్‌కు చెందిన లక్ష్మణ్‌మోరీ, మెర్మాన్‌భాయి వీరంతా ముఠాగా ఏర్పడ్డారు.  తక్కువ ధరకు రేషన్‌ బియ్యం సేకరించి శాయంపేట మండలం పత్తిపాక శివారుల్లో డంపు ఏర్పాటు చేశారు.  మహారాష్ట్రలోని సిరోంచాకు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. లారీ, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు విచారణకు శాయంపేట పోలీసులకు అప్పగించారు.  ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌జీ, సంతోష్, ఎస్సై ప్రేమానందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని