logo

వివరాల సమర్పణలో ఉపాధ్యాయుల వెనకంజ

ఏటా ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత, విద్య, వృత్తిపరమైన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. ఇందుకు గడువు వచ్చేనెల 7గా నిర్ణయించారు. గడువు సమీపిస్తున్న కొద్దీ సాంకేతిక సమస్యలు

Published : 29 Sep 2022 02:03 IST

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే:  ఏటా ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత, విద్య, వృత్తిపరమైన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. ఇందుకు గడువు వచ్చేనెల 7గా నిర్ణయించారు. గడువు సమీపిస్తున్న కొద్దీ సాంకేతిక సమస్యలు ఎదురవుతుంటాయని.. ఉపాధ్యాయులు వీలైనంత త్వరగా వివరాలు సమర్పిస్తే మేలని అధికారులు చెబుతున్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు సాధించిన అదనపు విద్యార్హతలను టీచర్స్‌ ఇన్ఫోలో పొందుపరచాలని గత నెలరోజులుగా అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఉపాధ్యాయులు వివరాలు సమర్పిస్తే సర్వర్‌పై అధిక భారం పడకుండా అన్ని వివరాలు వెంటవెంట నిక్షిప్తమవుతాయని చివరి సమయంలో ఉపాధ్యాయులు ప్రయత్నించినా సర్వర్‌ సతాయిస్తుందని చెప్పారు.

ఇదీ పరిస్థితి.. : రాష్ట్ర వ్యాప్తంగా 1,03,488 మంది ఉపాధ్యాయులుండగా వీరిలో 40,672 మంది మాత్రమే పూర్తిస్థాయిలో నమోదు చేశారు. 1,899 మంది ఉపాధ్యాయులు తమ వివరాలను పాక్షికంగా నమోదు చేసుకున్నారు. 60,917 మంది ఇంకా ప్రయత్నాలే మొదలు పెట్టలేదని సమాచారం.

సుమారు 60 రకాల సమాచారాన్ని నాలుగు విభాగాల్లో పొందుపర్చాలి.

మొదటి విభాగం:  ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచారం రెండు:  విద్యార్హతలు   మూడు: సేవా వివరాలు  నాలుగు: నమోదు చేసిన వివరాలన్నీ వాస్తవమేనని స్వయం ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.  ః తర్వాత విభాగాల వారీగా సమర్పణల దాఖలు విజయవంతమైందని  సంక్షిప్త సమాచారం వెంటనే కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని